క్రిష్ణ కిషోర్ పెమ్మరాజు

రచయిత మాట

క్రిష్ణ కిషోర్ పెమ్మరాజు

రాజకీయ నాయకులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పాదయాత్రలు ప్రారంభిస్తారు. ఎన్నికల్లో లబ్ధిపొందడమో, అధికారంలోకి రావడమో కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో యాత్రలు చేయడం మనకు తెలుసు. కానీ, ఒక రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం కాకుండా కాపాడడానికీ, యువత భవిత కోసం, ప్రజల బాగు కోసం పాదయాత్ర చేస్తే.. అధికారపక్షం అరాచకాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని, వారికి సాంత్వన చేకూర్చడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే.. దాన్నే ‘యువగళం’ అంటారు.

కుడు-సుడో తీర్చిదిద్దాలె.. ఎంతో పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రజల బాధలు తెలుసుకొని, భవిష్యత్తుపై భరోసా కల్పించడం కోసం ‘నేనున్నానంటూ ధైర్యంగా పాదయాత్రను ప్రారంభించారు లోకేశ్. ప్రతిపక్షం, అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు, అవరోధాలు సృష్టించినా.. అధైర్యపడకుండా, వెన్ను చూపకుండా ముందుకు సాగారు.

తెలుగుదేశం పార్టీ నంద్యాల... తన తండ్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గమైన కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించిన యువనేత, ప్రజలతో మమేకవుతున్నారు. ప్రతి అడుగూ ప్రజా కోసమే.. ప్రతి 100 కిలోమీటర్లకు ఓ రికార్డు. రైతులు, యువత, మహిళలు, చిరువ్యాపారులు, వృద్ధులు, పిల్లలు.. ఇలా ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ.. వారిలో విద్యావంతులందరినీ కలుపుతూ ముందుకు సాగారు.

యాత్ర ఆద్యంతం పకడ్బందీగా మారింది. ఎక్కడికక్కడ ప్రజలు నినాదాలు పలికారు. లోకేశ్ను సొంత బిడ్డలా ఆదరించారు. చంద్రబాబును అరెస్టు చేసి, యాత్రను రాజమండ్రి రైల్వే స్టేషన్లో నిలిపించినా చేసిన, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతో దాడులు చేయించి.. అధికార పార్టీ శ్రేణులతో దాడులు చేయించి.. ఇలా అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించినా లోకేశ్ వెనకడుగు, కుడుమ తిప్పలేదు.

తలకు, తన కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు కల్పించినా వీరుడిలా ఎదుర్కొన్నారు. ప్రజల కష్టాలను తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం ముగిసేసరికి.. ‘నాయకుడే కొడుకు అయ్యాడు..’ అని తండ్రి లాగా చూసారు ప్రజలు.. యాత్ర ముగిసే సమయానికి ‘ఆంధ్రప్రదేశ్కు ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడు దొరికాడు’ అని చెప్పుకోవడం విశేషం.

ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఆరంభం అంది అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. పాదయాత్రతో లోకేశ్ ఒక మంచి రాజకీయ నేతగా, పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగిన ఈ పరిణామ క్రమాన్ని వివరించే అవకాశం నాకు దక్కింది.

అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో లోకేశ్ వ్యవహరించిన తీరు రాజకీయ విశ్లేషకులనే ఔరా అనిపించింది. తాము ఎన్నుకున్న నాయకుడి మొండితనం, తండ్రి చంద్రబాబుకు ఉన్న రాజకీయ చతురతను లోకేశ్ పుణికిపుచ్చు కున్నారు. ఢిల్లీలో ఆయన వ్యవహార శైలి చూసిన జాతీయ రాజకీయ నాయకులు ‘ఇలాంటి కొడుకు ప్రతి తండ్రికీ ఉంటే ఎంతో బావుంటుంది’ అని అనుకోవడం కూడా నాకు తెలుసు.

యువగళం పేరిట లోకేశ్ తలపెట్టిన మహాయజ్ఞం విజయవంతంగా ముగియడానికి అహర్నిశలూ శ్రమించిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని ఎంత పొగిడినా తక్కువే. రాత్రింబవళ్లు శ్రమించి, నిరంతరం పరిభ్రమణం చేసుకుంటూ పాదయాత్ర దిగ్విజయం కావడానికి తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన కృషి ఎనలేనిది.

తెలుగు నేలపై గతంలో జరిగిన పాదయాత్రలకు భిన్నంగా.. రాష్ట్ర ప్రజల మదిలో నిలిచిపోయేలా జరిగిన యువగళం.. చరిత్రసృష్టించింది. ఈ మహక్రతువును ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా అక్షరీకరించే అదృష్టం నాకు దక్కడం గర్వంగా ఉంది.

అందరికీ నమస్సులతో...
మీ,
క్రిష్ణ కిషోర్ పెమ్మరాజు
Contact Number: 9392021001